పాత నోట్లు రద్దు చేస్తే, నల్లధనం బైటికొస్తుందా? -కార్టూన్

జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ

Black money

నల్ల ధనం వెలికి తీయడానికి ఆర్.బి.ఐ ఒక చిట్కా కనిపెట్టింది. అది, 2005కు ముందు ముద్రించబడిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం. జూన్ 30, 2014 లోపు ఈ పాత నోట్లను బ్యాంకుల్లో మార్చుకోవాలని ఆర్.బి.ఐ మూడు రోజుల క్రితం వినియోగదారుల కోరింది. 2005 ముందు నాటి నోట్లను ఉపసంహరించుకోవడం ఆర్.బి.ఐ చాలాకాలం క్రితమే ప్రారంభించిందని అయితే ఈ పనిని బ్యాంకుల వరకే పరిమితం చేశామని ఆర్.బి.ఐ గవర్నర్ రఘురాం రాజన్ చెప్పారు.

పాత నోట్ల ఉపసంహరణ ద్వారా నల్లధనాన్ని అరికట్టాలని భావిస్తున్నట్లు ఆర్.బి.ఐ గవర్నర్ మొదట తెలిపారు. ఈ పద్ధతిలో నల్లధనం ఏ మేరకు తగ్గించగలనరన్న అనుమానాలు వ్యక్తం కావడంతో ఆర్.బి.ఐ ఇప్పుడు మరో కారణం చెబుతోంది. పాత నోట్లకు భద్రత విషయంలో తక్కువ లక్షణాలు (features) కలిగి ఉన్నాయని, 2005 తర్వాత ముద్రించిన నోట్లకు మరిన్ని భద్రతా లక్షణాలను చేర్చామని తెలిపారు. పాత నోట్లను పోలిన దొంగనోట్లు ముద్రించడం తేలిక కాబట్టి ఉపసంహరిస్తున్నామన్న అర్ధం ఇక్కడ ధ్వనిస్తోంది.

నల్ల డబ్బు దొంగ నోట్ల రూపంలో ఉండేది చాలా తక్కువ. అసలు నల్ల డబ్బు విదేశీ బ్యాంకు ఖాతాల్లో మూలుగుతోంది. ఈ డబ్బు కరెన్సీ నోట్ల రూపంలో లేదు. వివిధ పెట్టుబడుల రూపంలో, షేర్ల రూపంలో, అనేకానేక బాండ్ల రూపంలో, బినామీ ఖాతాల రూపంలో నల్లధనం చెలామణిలో ఉంది. ఇలాంటి నల్ల డబ్బును వెనక్కి తెప్పించేందుకు ఏ మాత్రం ప్రయత్నాలు చేయకుండా…

View original post 239 more words

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s