జాతీయ అంతర్జాతీయ వార్తలు, విశ్లేషణ
అమెరికా ప్రస్తుతం ‘పోలార్ వొర్టెక్స్’ చలి కౌగిలిలో వణికిపోతోంది. మధ్య పశ్చిమ (Midwest) అమెరికా రాష్ట్రాల నుండి ఈశాన్య రాష్ట్రాల వరకు ఆర్కిటిక్ చలిగాలులు వీస్తుండడంతో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత -52o C వరకు నమోదయిందని పత్రికల ద్వారా తెలుస్తోంది. న్యూయార్క్, మిన్నెసోటా లాంటి రాష్ట్రాల్లో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. అవసరం అయితే తప్ప రోడ్ల మీదికి రావద్దని ప్రభుత్వాలు కోరాయి. తీవ్ర చలిగాలులు ఉన్న చోట బైటికి వెళితే తెలియకుండానే గడ్డకట్టుకుని చనిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నాయి. కెనడా మీదుగా ఆర్కిటిక్ ధ్రువం నుండి వచ్చిపడిన చలి మంచు తుఫాను ఈ పరిస్ధితికి కారణంగా తెలుస్తోంది.
ఈ వాతావరణ పరిస్ధితిని ‘పోలార్ వొర్టెక్స్’ గా వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భూగ్రహానికి ఉత్తర ధృవ ప్రాంతం అయిన ఆర్కిటిక్ ధృవ కేంద్రం నుండి అత్యంత తీవ్రమైన చలిగాలులు దక్షిణ దిశగా కెనడా, అమెరికాల మీదికి వీయడాన్ని ‘పోలార్ వొర్టెక్స్’ అంటారని వారు వివరిస్తున్నారు. పోలార్ వొర్టెక్స్ ప్రభావం సోమవారం నుండి అమెరికాలో తీవ్రంగా కనిపిస్తోంది. మరో మూడు, నాలుగు రోజుల వరకు ఇది కొనసాగుతుందని, పరిస్ధితి క్రమంగా మరింతగా దిగజారుతుందని వాతావరణ అధికారులను ఉటంకిస్తూ వివిధ పత్రికలు తెలిపాయి.
అమెరికా జనాభాలో సగం మంది పోలార్ వొర్టెక్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్నారు. అత్యంత ప్రమాదకరమైన ఉష్ణోగ్రతలకు తోడు గాలులు వీస్తున్నాయని, ఉత్తర రాష్ట్రాల్లో -50 డిగ్రీల…
View original post 630 more words